News

జీవోపై సుప్రీంకోర్టుకు వెళతాం


టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి 123 జీవోపై సుప్రీంకోర్టుకు వెళతామని అన్నారు. కొత్త భూ సేకరణ జీవోలో 2013 చట్టంలోని అన్ని అంశాలను చేరుస్తామని ప్రభుత్వం కోర్టుకు చెప్పినట్లు తమకు తెలిసిందని, భూసేకరణ చట్టాన్ని ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా సుప్రీం కోర్టుకు వెళతామని అన్నారు.